
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ హాస్పిటల్‌లో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ తెలిపారు. మోడర్న్ ఫెసిలిటీస్‌తో ఈ విద్యాసంవత్సరం నుంచే (2022 మార్చి) కాలేజీని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కాలేజీ ఏర్పాటుకు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెన్స్ అనుమతి ఇచ్చిందని చెప్పారు. కన్వీనర్ కోటా కింద 30 సీట్లు, మేనేజ్‌మెంట్ కోటా కింద 20 సీట్లు ఉంటాయని, మొత్తం 50 సీట్లకు అడ్మిషన్లు ఉంటాయని వివరించారు. అడ్మిషన్ల వివరాల కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ 040–68153333, 040–30102829 నంబర్‌లో లేదా www.tsrtc.telanganga.gov.in వెబ్‌సైట్‌లో చూడాలని శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు.