పిట్లం, వెలుగు : పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పిట్లం సీహెచ్ సీలో నర్సింగ్డేను నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్డాక్టర్ ఎస్వీ కిషన్ హస్పిటల్‌లోని నర్సులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
సమాజానికి నర్సులు చేస్తున్న సేవలు మరిచిపోలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెడికల్ఆఫీసర్శివకుమార్, క్లబ్ కోశాధికారి కాశీరెడ్డి సభ్యులు రాజ్‌కుమార్, చంద్రశేఖర్, బాలయ్య, సంతోష్ హస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.