ఇవాళ ( నవంబర్ 23) నర్సింగ్ ఆఫీసర్ల ఎగ్జామ్స్..రాయనున్న 41 వేల మంది

హైదరాబాద్ సిటీ, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నర్సింగ్ ఆఫీసర్ల ఎగ్జామ్స్ జరగనున్నాయి.13 సెంటర్లలో 41 వేల మంది అభ్యర్థులు ఎగ్జామ్స్​రాయనున్నారు. 2,322 పోస్టుల భర్తీకి రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్​నిర్వహిస్తున్నారు. మొదటి సెషన్​ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుండగా, అభ్యర్థులు 8.45 లోపే సెంటర్​కు చేరుకోవాలి. సెకండ్​సెషన్​మధ్యాహ్నం 12.40 ప్రారంభం అవుతుంది. నిమిషం లేటైనా అనుమతించబోమని మెడికల్ బోర్డు స్పష్టం చేసింది.