మల్కాజిగిరి, వెలుగు: హాస్టల్‌గదిలో ఓ నర్సింగ్స్టూడెంట్సూసైడ్చేసుకుంది. వెస్ట్‌బెంగాల్‌కు చెందిన సంజియా(20) నాచారం బాబానగర్‌లోని ప్రగతి నర్సింగ్ స్కూల్లో నర్సింగ్చేస్తోంది. కాలేజీ హాస్టల్లో ఉంటోంది. రోజూలాగే బుధవారం క్లాసులకు అటెండ్అయిన సంజియా తర్వాత తన రూమ్‌కు వెళ్లింది. రాత్రి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. సంజిమా గదిలో ఆమె ఒక్కటే ఉంటుందని కాలేజీ నిర్వాహకులు తెలిపారు. నాచారం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, డెడ్‌బాడీని గాంధీ మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.