
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాండ్లాపూర్రి చెందిన నర్సింగ్ విద్యార్థి శిరీష హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జూన్ 10 న రాత్రి ఆమె బావ అనిల్కొట్టడంతో ఇంటి నుంచి బయటకి వెళ్లిపోయింది. అనంతరం హత్యకు గురికావడంతో శిరీష బావ అనిల్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో..
అనిల్ఫోన్లో శిరీష నంబర్ డార్లింగ్ అని సేవ్ చేసి ఉంది. అనిల్ఫోన్లో శిరీషకు హాయ్ డార్లింగ్ అనే మెసేజ్‌లు పెట్టాడు. ఇదే విషయం అనుమానాలకు తావిస్తోంది. అతడ్ని విచారణ అనంతరం విడిచిపెట్టారు. పోస్ట్‌మార్టం అనంతరం డెడ్‌బాడీని కుటుంబసభ్యులకు అప్పగించిన పోలీసులు రీపోస్ట్‌మార్టం చేసేందుకు సిద్ధమవుతున్నారు. యువతిపై హత్యాచారం జరిగిందా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. డెడ్ బాడీని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు కాడ్లాపూర్కి పోలీసులు చేరుకున్నారు. అంతకుముందే కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాటు చేసుకున్నారు.