
బాలీవుడ్ నటి నుష్రత్ బరూచా లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ చోరీ 2. ఇది 2021లో వచ్చిన చోరీ మూవీకి సీక్వెల్. 2018లో వచ్చిన మరాఠీ మూవీ లపాచపీ ఆధారంగా ఈ చోరీ మూవీని తెరకెక్కించారు.
చోరీ 2 ట్రైలర్:
నేడు (ఏప్రిల్ 3న) ఈ హారర్-థ్రిల్లర్ 'చోరీ 2' ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సీక్వెల్ ట్రైలర్.. ప్రేక్షకులకు మరింత భయపెట్టేలా ఉంది. కథనంలో సాగే మలుపులను చూపిస్తున్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.
ఆడపిల్లలను చంపే ఆ రాజ్యంలో నుంచి తన బిడ్డను కాపాడుకునేందుకు నటి నుష్రత్ భరుచ్చా చేసే ప్రయత్నమే ఈ సినిమా. ఈ క్రమంలో తన బిడ్డను రక్షించుకోవడానికి మరియు అతీంద్రియ శక్తులతో ఎలాంటి యుద్ధం చేసిందనేది చూపించారు.
►ALSO READ | TheParadise: ఏనుగు నడిస్తే.. కుక్కలు అరుస్తాయి.. ‘దిప్యారడైజ్’రూమర్స్‌కు ఇచ్చేపడేసిన టీమ్
ట్రైలర్ మొదలవుతూనే ఓ కరుడుగట్టిన రాజుని రివీల్ చేశారు. ఆ రాజ్యంలో అబ్బాయిలే మాత్రమే పుట్టాలనేది రాజు ఆజ్ఞా. కానీ, అతని రాజ్యంలో ఓ అమ్మాయి పుడుతుంది. దీంతో ఆ రాజుకు కోపం వస్తుంది. ఎలాగైనా పాపను చంపమని తన దాసిని రాజు రంగంలోకి దింపుతాడని చెప్పగానే ఓ దెయ్యం వస్తుంది.
చోరీ 2 ఓటీటీ:
విశాల్ ఫ్యూరియా దర్శకత్వం వహించిన చోరీ 2 ఏప్రిల్ 11 నుంచి నేరుగా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా 240 కి పైగా దేశాలలలో ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండనుంది.
ఇప్పటికే, ఈ హార్రర్ థ్రిల్లర్ నుంచి వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా వచ్చిన ట్రైలర్ మరింత ఇంపాక్ట్ చూపించింది. ఇందులో సోహా అలీ ఖాన్, గష్మీర్ మహాజని, సౌరభ్ గోయల్, పల్లవి అజయ్, కుల్దీప్ సరీన్ మరియు హార్దికా శర్మ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
The nightmare never left. It’s back, and it’s closer than ever 👁️#Chhorii2OnPrime, April 11@Nushrratt @sakpataudi @FuriaVishal @TSeries @Abundantia_Ent #TamariskLane @PsychScares #BhushanKumar #KrishanKumar @vikramix @NotJackDavis @saurabhgoyall pic.twitter.com/JVnCaRrKe7
— prime video IN (@PrimeVideoIN) April 3, 2025