
హైదరాబాద్, వెలుగు: హెల్త్, న్యూట్రిషన్ ప్రొడక్టులు తయారు చేసే రెకిట్ గావిస్కాన్ డబుల్ యాక్షన్‌ను విడుదల చేసింది. గ్యాస్, ఎసిడిటీ, మంట నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది. పుల్లని త్రేన్పులకు కూడా పరిష్కారం చూపుతుంది.
రెకిట్ హౌస్ నుంచి వస్తున్న కొత్త గావిస్కాన్ డబుల్ యాక్షన్ సొల్యూషన్ రిఫ్లెక్స్ బాధితులకు అత్యంత ప్రభావవంతమైన పరిష్కారమని కంపెనీ తెలిపింది. దీనిని గర్భిణులు కూడా వాడొచ్చని రెకిట్ పేర్కొంది.