చామంతి టీ తాగడం మంచిది అంటున్నారు న్యూట్రిషనిస్టులు. చామంతిలోని ఫ్లేవనాయిడ్స్ ఔషధ గుణాలు ఉంటాయి. చలికాలంలో ఈ టీ తాగితే హెల్దీగా ఉండొచ్చు.
* నిద్రలేమి(ఇన్సోమ్నియా)తో బాధపడేవాళ్లు చామంతి టీ తాగాలి. ఈ టీలో ఉండే ఎపిజెనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ నిద్ర పట్టేలా చేస్తుంది.
* మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు చామంతి టీ టేస్ట్ చేస్తే మూడ్ మారుతుంది. మనసు తేలికవుతుంది. ఈ సీజన్లో రోజూ వేడివేడి చామంతి టీ తాగితే జలుబు నుంచి రిలీఫ్ ఉంటుంది.
* అంతేకాదు, చామంతి టీ ఆవిరి పట్టినా కూడా ముక్కు కారడం, గొంతు నొప్పి వంటివి తగ్గిపోతాయి.
* నెలసరి నొప్పులు తగ్గడానికి కూడా చామంతి టీ చామంతి టీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బ్లడ్ షుగర్ ని తగ్గిస్తాయి.
* తక్కువ క్యాలరీలు ఉండే ఈ టీని డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా తాగొచ్చు.