BAN vs SL: జూనియర్ మలింగ హ్యాట్రిక్.. ముంబై ఇండియన్స్‌కు ఆ లోటు తీరినట్టే

శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషార మాజీ స్టార్ పేసర్ లసిత్ మలింగాను గుర్తు చేస్తున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఈ యువ బౌలర్ ముందు మలింగ సరిపోడేమో అనే అనుమానం కలుగుతుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య మ్యాచ్ చూస్తే ఇతని బౌలింగ్ కు షాక్ అవ్వాల్సిందే. పదునైన యార్కర్లతో బెంబేలిత్తిస్తున్నాడు. కొట్టడం సంగతి అలా ఉంచితే బంగ్లా బ్యాటర్లు ఇతని బౌలింగ్ ఆపడానికే నానా  తంటాలు పడుతున్నారు. ఈ మ్యాచ్ లో హ్యాట్రిక్ తో మెరిసి ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. 

బంగ్లాదేశ్ తో మూడో టీ20 మ్యాచ్ సందర్భంగా తుషార నాలుగో ఓవర్ లో అద్భుతమే చేశాడు. ఈ ఓవర్ తొలి రెండో బంతికి  నజ్ముల్ శాంటో స్టంప్‌ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత రెండు బంతులకు తౌహిద్ హృదయ్, మహ్మదుల్లాను టాప్ డెలివరీలతో అవుట్ చేశాడు. వీటిలో రెండు బౌల్డ్ లతో పాటు ఒక ఎల్బీడబ్ల్యూ ఉంది. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో హ్యాట్రిక్ తీసిన ఐదో శ్రీలంక బౌలర్ గా నిలిచాడు.   ఈ ఓవర్ మెయిడెన్ వేసిన తుషార.. ఆరో ఓవర్ లో సౌమ్య సర్కార్ ను పదునైన యార్కర్ తో బోల్తా కొట్టించాడు. తుషార స్పెల్ తో బంగ్లాదేశ్ ఒక్కసారిగా 32 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది. 

ALSO READ :- Krithi Shetty: మనమే అంటున్న కృతి..పింక్ డ్రెస్లో మతిపోగెట్టేస్తుంది

2023 ఐపీఎల్ మినీ వేలంలో నువాన్ తుషార్ రూ. 4.18 కోట్లకు దక్కించుకుంది. గతంలో ముంబై ఇండియన్స్ విజయాల్లో మలింగ పాత్ర మరువలేనిది. ప్రస్తుతం మలింగా లేని ముంబై జట్టులో స్పష్టంగా కనిపిస్తుంది. తుషార బౌలింగ్ చూస్తుంటే ఆ లోటు తీరిపోయేలాగే కనిపిస్తుంది. స్టార్ పేసర్ బుమ్రాతో కలిసి బౌలింగ్ వేస్తే ప్రత్యర్థులకు చుక్కలు కనబడాల్సిందే. అయితే తుది జట్టులో తుషారకు చోటు కల్పిస్తారో లేదో చూడాలి. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కుషాల్ మెండీస్ 86 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. మిగిలిన వారందరూ విఫలమయ్యారు. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 146 పరుగులకు ఆలౌటైంది. తుషార నాలుగు వికెట్లు పడగొట్టగా.. హసరంగా 2 వికెట్లు తీసుకున్నాడు.