మెట్రో కొత్త కోచ్ లు ఇప్పుడు అందుబాటులోకి తీసుకురావడం కష్టమన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. త్వరలో నాగపూర్ కి సంబంధించిన మెట్రో కోచ్ లను అద్దె ప్రాతిపదికన తీసుకొస్తామని చెప్పారు. గతంలో మెట్రో నష్టాలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. గత 8 ఏళ్లలో కొత్త మెట్రో రాకపోవడం వల్ల హైదరాబాద్ మెట్రో 9వ స్థానానికి చేరుకుందన్నారు. రెండో దశ మెట్రో పూర్తయితే రెండవ స్థానానికి చేరుకునే అవకాశం ఉందన్నారు ఎన్వీఎస్ రెడ్డి.
చాంద్రాయణగుట్ట ప్రధాన జంక్షన్ కానుందని.. సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రైల్ రెండో దశ పై ప్రతేక దృష్టి పెట్టారని తెలిపారు. రూ. 24,269 వేల కోట్ల రూపాయలతో రెండవ దశ మెట్రో పనులను ప్రారంభిస్తామన్నారు.
మెట్రో రైళ్లలో అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు వస్తుంటాయని అన్నారు. మీడియా ఇలాంటివాటిపై ఎక్కువగా ఫోకస్ చేస్తోందన్నారు. ప్రపంచంలో సక్సెస్ అయిన మెట్రోలలో హైదరాబాద్ మెట్రో ఒకటిగా నిలిచిందని అన్నారు. 2010లో బిడ్ ప్రాసెస్ కి వెళ్తే.. ఈరోజు ఈ పరిస్థితి చూస్తున్నామని అన్నారు. ఆన్లైన్ పేమెంట్స్ లో భారత్ ప్రపంచంలోకెల్లా ముందుందని అన్నారు ఎన్వీఎస్ రెడ్డి.