యాదాద్రి, వెలుగు : వచ్చే ఎన్నికల్లో ఆలేరు, భువనగిరిలో గెలిచి యాదాద్రి జిల్లాపై కాషాయ జెండా ఎగురవేద్దామని బీజేపీ స్టేట్వైస్ ప్రెసిడెంట్ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన భువనగిరిలో జరిగిన పార్టీ అనుబంధ మోర్చాల మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ గవర్నమెంట్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. ప్రజలను కలుసుకొని, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరించాలన్నారు. బీజేపీ లీడర్ దంతూరి సత్తయ్య అధ్యక్షతన జరిగిన మీటింగ్‌లో నాయకులు గూడూరు నారాయణరెడ్డి, పాశం భాస్కర్, లింగస్వామి, ఉమాశంకర్‌రావు, నర్ల నర్సింగ్ రావు, మాయ దశరథ, పడమటి జగన్మోహన్ రెడ్డి, సుర్వి లావణ్య, రాజశేఖర్ రెడ్డి, నరేశ్‌నాయక్, మహమూద్, జనగాం కవిత, రత్నాపురం బలరాం ఉన్నారు.