మియాపూర్ భూముల  స్కాం, నయీం కేసు ఏమైంది? : ఎన్ వీఎస్ఎస్ ప్రభాకర్

మియాపూర్ భూముల  స్కాం, నయీం కేసు ఏమైంది? : ఎన్ వీఎస్ఎస్ ప్రభాకర్
  • మియాపూర్ భూముల  స్కాం, నయీం కేసు ఏమైంది?
  • సీఎం కేసీఆర్​కు ఎన్ వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్న

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్​సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, మియాపూర్ భూములు, నయీం కేసు ఏమైందో సీఎం కేసీఆర్ చెప్పాలని బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్ వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. మియాపూర్ భూముల స్కామ్ లో బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ప్రమేయం ఉందని వార్తలొచ్చాయని, నాయకులు, నటుల చుట్టూ తిరిగిన డ్రగ్స్ కేసు, ఓటుకు నోటు కేసు, ఈఎస్ఐ స్కామ్ కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో  కేసీఆర్ ఫ్యామిలీ బతుకు బస్టాండ్ కావటం ఖాయమని ఆయన ఎద్దేవా చేశారు. 

ALSO READ: మన దగ్గర ఉన్న అమ్మ ఒడి వాహనాలు దేశంలో ఎక్కడా లేవ్​ : కేసీఆర్

పార్టీ మారట్లే: బండారు శ్రీవాణి, చేతన

మేము బీజేపీని వీడుతున్నామని అసత్య ప్రచారం చేస్తున్నారని, కొన్ని పేపర్లు పనిగట్టుకొని మాపై తప్పుడు రాతలు రాస్తున్నాయని రామంతపూర్, హబ్సీగూడ కార్పొరేటర్లు బండారు శ్రీవాణి, చేతనలు తెలిపారు. శుక్రవారం పార్టీ స్టేట్​ఆఫీసులో వారు మీడియాతో మాట్లాడారు.  మోదీ ఆశయాల సాధన కోసమే బీజేపీలో కొనసాగుతున్నామని, పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు.