చెన్నై వేదికగా అఫ్ఘానిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆసక్తికరపోరు సాగుతోంది. వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ ఓటమి ఎరుగని కివీస్.. గత మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘన్లు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై ఆఫ్ఘన్ స్పిన్నర్లు ప్రభావం చూపలేకపోయారు. డెవాన్ కాన్వే(20) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరినా.. మరో ఓపెనర్ విల్ యంగ్(54), రచిన్ రవీంద్ర(32) కివీస్ స్కోరుబోర్డును ముందుకునడిపించారు. ఆపై వీరిద్దరూ వెనుదిరిగినా టామ్ లథమ్(68), గ్లెన్ ఫిలిప్స్(71) జోడి నిలకడగా ఆడుతూ ఆఫ్ఘన్ ముందు భారీ స్కోర్ నిర్ధేశించారు. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీనుల్ హక్, అజ్మతుల్లా ఒమర్జాయ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
2️⃣8️⃣9️⃣ to Win! ?
— Afghanistan Cricket Board (@ACBofficials) October 18, 2023
The @BLACKCAPS, riding on a 144-run 5th wicket stand, managed to put in 288/6 in the 1st inning. Naveen (2/48), @AzmatOmarzay (2/56), @RashidKhan_19 (1/41) and @Mujeeb_R88 (1/57) chipped in with wickets each. ?#AfghanAtalan | #CWC23 | #AFGvNZ pic.twitter.com/75JWc20ekE