వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 369 పరుగుల లక్ష్యంతో సెంకడ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కివీస్ జట్టు 41 ఓవర్లలో 111/3 స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించి 196 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ రెండో ఇన్నింగ్స్ లో 65 పరుగులకు ఆరు వికెట్లు.. మొత్తంగా మ్యాచ్ లో పది వికెట్లు తీసి జట్టు విజయంలో కీ రోల్ పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ, రెండో ఇన్ని్ంగ్స్ లో ఒక వికెట్ తీసిన ఆల్-రౌండర్ కామెరాన్ గ్రీన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కి్ంది.
Also read : ఇండో‑పాక్ టికెట్లు ధర రూ. 1.84 కోట్లు!
అంతకుముందు 13/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 51.1 ఓవర్లలో 164 రన్స్‌కే ఆలౌటైంది. నేథన్ లైయన్ (41) టాప్ స్కోరర్. కామెరూన్ గ్రీన్ (34), హెడ్ (29) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. గ్లెన్ ఫిలిప్స్5, హెన్రీ 3 వికెట్లు తీశారు.