బెంగుళూరు, చిన్న స్వామి వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్, పాకిస్తాన్ మ్యాచ్ హోరీహోరీగా సాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 402 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. ఛేదనలో పాక్ బ్యాటర్లు ధీటుగా బదులిస్తున్నారు. అబ్దుల్లా షఫిక్(6) త్వరగా ఔటైనా.. పఖర్ జమాన్- బాబర్ ఆజాం జోడి ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో పఖర్ జమాన్ 63 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో సెంచరీ మార్క్ చేరుకున్నాడు. దీంతో పాకిస్తాన్ 20 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 152 పరుగులు చేసింది.
402 పరుగుల లక్ష్య చేధనకు దిగిన పాక్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న అబ్దుల్లా షఫీక్(4) పరుగులకే వెనుదిరిగాడు. ఆపై పఖర్ జమాన్- బాబర్ ఆజాం జోడి మొదట ఆచి తూచి ఆడినా.. కుదురుకున్నాక కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా పఖర్ జమాన్ మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 63 బంతుల్లోనే సెంచరీ మార్క్ చేరుకున్నాడు. దీంతో పాక్ శిబిరంలో నవ్వులు కనిపిస్తున్నాయి.
ALSO READ :- ODI World Cup 2023: దేశం కోసం గాయాన్ని భరించలేవా.. హార్దిక్‌పై నెటిజన్స్ ఫైర్
? FASTEST WORLD CUP CENTURY FOR A PAKISTAN BATTER ?
— Pakistan Cricket (@TheRealPCB) November 4, 2023
9️⃣ sixes in his 63-ball ?! ?#NZvPAK | #CWC23 | #DattKePakistani pic.twitter.com/LWxmIKMKbB
వర్షం అంతరాయం
ఇదిలావుంటే, ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ప్రస్తుతానికి డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో పాక్ 10 పరుగుల ముందంజలో ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ ఇక్కడితో ఆగిపోతే పాక్ విజయం సాధిస్తుంది.
ITS RAINING.....!!!!!
— Johns. (@CricCrazyJohns) November 4, 2023
- PAKISTAN IS 10 RUNS AHEAD OF DL METHOD.* pic.twitter.com/fQMgIFuZdi