సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లోనూ పాకిస్తాన్ బౌలర్లు విఫలమయ్యారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పేస్ బౌలింగ్ తమదే అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆడింది మాత్రం లేదు. శనివారం న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ పేసర్లు షాహిన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, హసన్ అలీ ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే పరుగులు ఇవ్వడానికి ఈ ముగ్గురూ పోటీపడ్డారు.
అఫ్రిది తన 10 ఓవర్లలో వికెట్లేమీ తీయకపోగా 9 ఎకానమీ చొప్పున 90 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక హరీస్ రౌఫ్‌ఎం హసన్ అలీ వికెట్ చొప్పున తీసినా 80 పైచిలుకు పాలిగులు ఇచ్చుకున్నారు. ఈ మ్యాచ్ లో ఈ త్రయం ఏకంగా 257 పరుగులు సమర్పించారు. దీంతో పాక్ బౌలర్లపై భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ సెటైర్లు వేశారు. పాక్ బౌలింగ్ యూనిట్ చూస్తుంటే.. పళ్లు లేని ముసలోళ్లు నవ్వుతున్నట్లు ఉందని చమత్కరించారు. ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
ALSO READ :- NZ vs PAK: ఓవర్లు కుదించారు.. 9 చొప్పున కొడితేనే పాకిస్తాన్ గెలుపు
Pakistan’s bowling has been toothless thru out the World Cup.
— Irfan Pathan (@IrfanPathan) November 4, 2023
కాగా, అంతకుముందు రచిన్ రవీంద్ర(108; 94బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స్), కేన్ విలియమ్సన్ (95; 79 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 402 పరుగులు చేసింది.
0️⃣-9️⃣0️⃣
— Sky Sports Cricket (@SkyCricket) November 4, 2023
1️⃣-8️⃣5️⃣
Pakistan's two worst bowling figures in World Cup history from Shaheen Afridi and Haris Rauf...the record was broken just 10 minutes apart! ? pic.twitter.com/qRjmzGKIHW
- 344/9 Vs Sri Lanka.
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 4, 2023
- 192/3 (30.3) Vs India.
- 367/9 Vs Australia.
- 401/6 Vs New Zealand.
Pakistan bowling going all over the places in this World Cup....!!! pic.twitter.com/VXhyvc48Pb
#PAKvNZ::-Pakistan bowling situation. pic.twitter.com/urbAGHpGz5
— Matin Khan (@matincantweet) November 4, 2023