టి20 ప్రపంచ కప్‌లో భాగంగా సోమవారం(జూన్ 17) న్యూజిలాండ్- పపువా న్యూ గినియా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమవుతోంది. టాస్ వేసే కొద్ది క్షణాల ముందు వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అంపైర్లు టాస్ వాయిదా వేశారు. సిబ్బంది మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.
ఈ ఇరు జట్లు ఇప్పటికే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించాయి. కివీస్ జట్టు ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి రెండింట ఓటమి పాలయ్యింది. మరోవైపు, న్యూ గినియా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. చివరి పోరులో గెలిచి గౌరవప్రదంగా టోర్నీ నుంచి వైదొలగాలని ఇరు జట్లు ఆశిస్తున్నాయి. కాగా, కివీస్ స్పీడ్ గన్ ట్రెంట్ బౌల్ట్‌కు ఇది చివరి టీ20 ప్రపంచ కప్ మ్యాచ్. అతను ఇప్పటికే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని టీమ్ మేనేజ్మెంట్‌కు తెలియజేశాడు.
The toss between New Zealand and Papua New Guinea has been delayed due to rain ☔#T20WorldCup | #NZvPNG | 📝: https://t.co/haAstLpaox pic.twitter.com/tpL2B2W3Vk
— ICC (@ICC) June 17, 2024