న్యూజిలాండ్‍తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు వీరవిహారం చేశారు. క్వింటన్ డికాక్ (114; 116 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులు), వాండర్ డస్సన్(133; 118 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులు) శతకాలు బాధగా, ఆఖరిలో డేవిడ్ మిల్లర్(53; 30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు) మెరుపులు మెరిపించాడు. దీంతో సఫారీ జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సఫారీ జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. ఎప్పటిలానే ఆ జట్టు కెప్టెన్ టెంబా బవుమా(24) మరోసారి విఫలమయ్యాడు. అదే వారికి కలిసొచ్చింది. అతని స్థానంలో క్రీజులోకి వచ్చిన వాండర్ డస్సన్, డికాక్‌తో జతకలిశాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో డికాక్(114) టోర్నీలో నాలుగో సెంచరీ పూర్తిచేసుకోగా.. వాండర్ డస్సన్(133) రెండో శతకాన్ని నమోదు చేశాడు. ఆఖరిలో డికాక్ వెనుదిరిగినా అతని స్థానంలో వచ్చిన డేవిడ్ మిల్లర్(53; 30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు) మెరుపులు మెరిపించాడు.
- Hundred Vs Sri Lanka.
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 1, 2023
- Hundred Vs Australia.
- Hundred Vs Bangladesh.
- Hundred Vs New Zealand.
This is Quinton De Kock's World Cup - 4 centuries from just 7 matches, insane stuff...!!! pic.twitter.com/eKeJzE0AQD
ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. పోటీపడి పరుగులిచ్చారు. గాయం కారణంగా మ్యాట్ హెన్రీ మ్యాచ్ మధ్యలోనే వైదొలగడం వారిని మరింత దెబ్బకొట్టింది. టిమ్ సౌథీ, జిమ్మీ నీషామ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
They lost the toss, but South Africa go past 350 once again in the World Cup after batting first!
— ESPNcricinfo (@ESPNcricinfo) November 1, 2023
New Zealand need 358 to win in Pune ? https://t.co/mrENWOl73e #NZvSA #CWC23 pic.twitter.com/lpcSku1zbL