NZ vs RSA: కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. ఓడితే పాక్, ఆఫ్గన్ సెమీస్ రేసులోకి

వన్డే పప్రపంచ కప్‌లో నేడు మరో రసవత్తర పోరు జరగనుంది. జోరుమీదున్న దక్షిణాఫ్రికా.. న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సమవుజ్జీల పోరు అభిమానులకు మంచి మజా అందించనుంది. 

ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు తప్పక గెలవాలి. తొలి నాలుగింటిలో విజయం సాధించి, ఆ తర్వాత వరుసగా రెండింటిలో ఓడిన కివీస్‌ (8 పాయింట్లు).. ఇంకొకటి ఓడితే అఫ్గానిస్థాన్‌ (6), పాకిస్థాన్‌ (6)లో సెమీస్‌ ఆశలను పెంచినట్లవుతుంది. అలాగే, ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే.. 12 పాయింట్లతో దాదాపుగా సెమీఫైనల్‌ చేరినట్లే.

తుది జట్లు

దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి. 

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్.