స్వదేశంలో పాకిస్తాన్ మహిళా జట్టుతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ మహిళా జట్టు వికెట్ తేడాతో విజయం సాధించింది. తొలుత పాక్ 220 పరుగులు చేయగా.. కివీస్ మహిళలు లక్ష్యాన్ని 48.5 ఓవర్లలో చేధించారు. ఛేదనలో 208 పరుగుల వద్ద న్యూజిలాండ్ 9వ వికెట్ కోల్పోవడంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. బంతి బంతికి అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠను పంచింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 220 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యారు. కెరీర్ లో తొలిసారి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన బ్యాటింగ్ ఆల్ రౌండర్ ఫాతిమా సనా(90) పరుగులతో రాణించింది. కివీస్ బౌలర్లలో సోఫీ డివైన్ 3 వికెట్లు తీసుకోగా.. ఫెన్ ఫోల్డ్, ఫ్రాన్ జొనాస్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం చేధనకు దిగిన కివీస్ మహిళా జట్టు 15 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో సుజీ బేట్స్(74)- మ్యాడీ గ్రీన్(83) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 142 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.దీంతో న్యూజిలాండ్ విజయం లాంఛనమే అనుకున్నప్పటికీ.. గులామ్ ఫాతిమా చెలరేగడంతో కివీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 198 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పయిన కివీస్‌ను లీ తహుహు(21) నిలకడగా ఆడుతూ విజయతీరాలకు చేర్చింది. ఈ గెలుపుతో కివీస్ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే చేజిక్కించుకుంది.
A close finish in Christchurch!
— Pakistan Cricket (@TheRealPCB) December 15, 2023
Terrific fight shown by Pakistan in the second ODI as New Zealand win by one wicket ?#NZWvPAKW | #BackOurGirls pic.twitter.com/1XNnFbKiqp