సందేశాత్మకంగా ఓ అందాల రాక్షసి

సందేశాత్మకంగా ఓ అందాల రాక్షసి

షెరాజ్ మెహదీ హీరోగా నటిస్తూ,  దర్శకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌గా రూపొందించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. విహాన్షి హెగ్డే, నేహా దేశ్‌‌పాండే హీరోయిన్స్.  సురీందర్ కౌర్ నిర్మించారు. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా షెరాద్ మెహదీ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు భాష్యశ్రీ  గారు కథ మాటలు, పాటలు రాశారు. అలాగే స్క్రీన్ ప్లేలో కూడా సపోర్ట్ చేశారు. ఇది  గ్లామర్ బేస్డ్ మూవీ కాదు. మంచి కంటెంట్ ఉన్న సినిమా.

అమాయక మహిళలు కొందరి చేతిలో ఎలా మోసపోతున్నారు అనేది ఇందులో  చూపిస్తున్నాం. అలాగే మోసం చేసేవారికి శిక్ష కూడా ఉంటుందని చెబుతున్నాం.  సుమన్, తమ్మారెడ్డి భరద్వాజ గారు ఇంపార్టెంట్ రోల్స్‌‌లో నటించారు’ అని చెప్పాడు.  తన క్యారెక్టర్‌‌‌‌లో ఎన్నో షేడ్స్ ఉంటాయని విహాన్షి చెప్పింది. ప్రేక్షకుల మనసులకు టచ్ అయ్యేలా సినిమా ఉంటుందని నేహా దేశ్‌‌పాండే అంది. కమర్షియల్ అంశాలతో పాటు మెసేజ్ ఇచ్చే చిత్రమని రైటర్ భాష్యశ్రీ అన్నారు.