ఇది థియేటర్లోకి రానంతవరకే చిన్న సినిమా.. ‘ఓ అందాల రాక్షసి’ డైరెక్టర్ షెరాజ్ మెహాదీ

ఇది థియేటర్లోకి రానంతవరకే చిన్న సినిమా..  ‘ఓ అందాల రాక్షసి’ డైరెక్టర్ షెరాజ్ మెహాదీ

షెరాజ్ మెహాదీ హీరోగా, దర్శకుడిగా రూపొందించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’.  నేహా దేశ్ పాండే,  విహాన్షి హెగ్డే, కృతి వర్మ హీరోయిన్స్‌‌గా నటించారు.  సురీందర్ కౌర్ నిర్మించారు. మార్చి 21న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన  ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో షెరాజ్ మెహదీ మాట్లాడుతూ ‘ఇది థియేటర్లోకి రానంతవరకే చిన్న సినిమా.

ఒకసారి మా సినిమా థియేటర్‌‌‌‌లోకి వచ్చాక దాని రేంజ్ ఏంటో ఆడియెన్స్‌‌కి తెలుస్తుంది. ఈ  ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘ఉమెన్ సెంట్రిక్‌‌గా సాగే ఈ కథ అందరికీ నచ్చుతుంది. ఇలాంటి చిత్రాలను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.   మంచి మెసేజ్ ఇచ్చే చిత్రం ఇదని రైటర్ భాష్యశ్రీ చెప్పాడు.