ఓ భామా అయ్యో రామ టైటిల్ సాంగ్ విడుదల!

ఓ భామా అయ్యో రామ టైటిల్ సాంగ్ విడుదల!

సుహాస్‌‌, మాళవిక మనోజ్ జంటగా రామ్ గోధల దర్శకత్వంలో హరీష్‌‌ నల్ల నిర్మిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఇప్పటికే టీజర్‌‌‌‌ను విడుదల చేసిన మేకర్స్‌‌.. గురువారం టైటిల్‌‌ సాంగ్‌‌ను విడుదల చేశారు. రధన్ కంపోజ్ చేసిన ఈ యూత్‌‌ఫుల్‌‌ సాంగ్‌‌ను శరత్‌‌ సంతోష్‌‌ పాడారు.  

ఎలాగుండే వాడ్నే ఎలాగయిపోయానే..  ఎరక్క పోతూనే ఇరుక్కు పోయానే..  ఓ భామ అయ్యో రామ నేనేం చేశానమ్మా.. అందం, అపాయం కలిపి కనిపిస్తావేంటమ్మా..’ అంటూ శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. పాట విడుదల సందర్భంగా నిర్మాత హరీష్​ మాట్లాడుతూ ‘పూర్తి వినోదాత్మకంగా రాబోతున్న ఈ రొమాంటిక్‌‌ ఎంటర్‌‌టైనర్‌‌ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటుంది’ అని చెప్పారు.  ఓ మంచి సినిమాను చూశామనే అనుభూతిని అందించే సినిమా అవుతుందని దర్శకుడు చెప్పాడు.