అంబులెన్స్​కు దారి ఇవ్వండి

అంబులెన్స్​కు దారి ఇవ్వండి

వెలుగు: ప్రపంచ రంగస్థల నాటక దినోత్సవం సందర్భంగా అంబులెన్స్​కు దారి ఇవ్వండనే నినాదంతో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్​ స్కూల్​ విద్యార్థులు వీధి నాటకాన్ని ప్రదర్శించారు. గురువారం  సైబరాబాద్​ పరిధిలోని ఖాజగూడ, గచ్చిబౌలి, సైబర్ టవర్స్, ఐఐఐటీ కూడళ్లలో ట్రాఫిక్​ కారణంగా అంబులెన్స్​కు దారి ఇవ్వకపోవడంతో మరణాలు ఎక్కు వవుతున్నాయని ప్రదర్శన నిర్వహించి వాహనదారులకు అవగాహన కల్పించారు.వాహాన‌దారులు ఎవ‌రైనా స‌రే వాహానాలను నడిపే సమయంలో సెల్ ఫోన్లో మాట్లాడడం, ఆజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్స్ అతిక్రమించడం, రాంగ్ రూట్ లో వెళ్లడం లాంటివి చేయవద్దని విద్యార్ధులు ఈ సంద‌ర్భంగా అన్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ లకు దారి ఇవ్వాలని సూచించారు.