స్కాలర్​షిప్స్ ​అందించిన ఒయాసిస్​

స్కాలర్​షిప్స్ ​అందించిన ఒయాసిస్​

హైదరాబాద్​, వెలుగు: హెల్త్ కేర్ రంగంలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిభావంతులైన, అర్హులైన పది  మంది విద్యార్థులకు ఒయాసిస్ ఫెర్టిలిటీ స్కాలర్​షిప్స్​ అందించింది.  ఇప్పటి వరకు 95 వేలకుపైగా జంటలు తమ క్లినిక్ ​ద్వారా తల్లిదండ్రులు అయ్యారని ప్రకటించింది. సంతానం లేని వారి కోసం  ఇన్ విట్రో మెచ్యూరేషన్ (ఐవీఎమ్)  అధునాతన జన్యు పరీక్షతో సహా ఎన్నో అత్యాధునిక ఫెర్టిలిటీ చికిత్సలను అందిస్తున్నామని తెలిపింది. హైదరాబాద్​లో బుధవారం జరిగిన వార్షికోత్సవంలో నటి రమ్యకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను అభినందించారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినికల్ డైరెక్టర్ అండ్ కో ఫౌండర్ డాక్టర్ దుర్గారావు ఐవీఎఫ్ గురించి అపోహలు, ఫెర్టిలిటీ వైద్యంలో శాస్త్రీయ పురోగతి, టెక్నాలజీల గురించి వివరించారు. అనంతరం రమ్యకృష్ణ విద్యార్థులకు స్కాలర్ షిప్ సర్టిఫికెట్లను అందజేశారు.