డయాబెటిస్ ఉన్నవాళ్లు రక్తంలో చక్కెర పెరగకుండా చూసుకునేందుకు చాలా జాగ్రత్తపడతారు. బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం శ్నాక్, రాత్రి భోజనం.. ఏదైనా కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ కోసం చూస్తారు. ఆరోగ్యం కోసం వీళ్లు ఏం తినాలో చెప్తున్నారు డయాబెటిస్ స్పెషలిస్ట్ అశోక్ కుమార్ జింగాన్.
- ఓట్స్ లో కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.
- ఇవి రక్తంలో చక్కెరని పీల్చుకుంటాయి. దాంతో షుగర్ లెవల్స్ పెరగవు.
- అందుకని బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ తో అంబలి లేదా జావ చేసుకుని తాగితే మంచిది.
- లేదంటే ఓట్స్ ని పండ్లు, చియా సీడ్స్ కలిపి తిన్నా బాగుంటుంది.
- చియా సీడ్స్ ని నీళ్లలో నానబెట్టి తినాలి.
- వీటిలోని ఫైబర్ చక్కెరని కంట్రోల్లో ఉంచుతుంది.
- బ్రేక్ ఫాస్ట్ టైంలో గుడ్డు తినొచ్చు. దీనిలో క్యాలరీలు తక్కువ, ప్రొటీన్లు ఎక్కువ.
- అట్లనే శనగ పిండితో అట్లు వేసుకుని తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిది.
- ఇందులోని ఫైబర్, మెగ్నీషియం చక్కెర శాతం పెరగకుండా చూస్తాయి.
- ప్రొబయాటిక్స్ ఉండే పెరుగు తింటే పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.
- పెరుగులోని బ్యాక్టీరియా లాక్టోజ్ అనే చక్కెరని వాడుకుంటుంది.
- దాంతో బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ లో ఉంటుంది.
- వీటితో పాటు శ్నాక్ గా బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ వంటివి తిన్నకూడా శరీరానికి అవసరమైన ప్రొటీన్, ఫైబర్ అందుతాయి.