
బషీర్బాగ్, వెలుగు: అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఉన్న పదవులు కేటాయించాలని ఓబీసీ డెమొక్రటిక్ జేఏసీ డిమాండ్ చేసింది. కాచిగూడ అభినందన్ గ్రాండ్ హోటల్లో ఓబీసీ డెమొక్రటిక్ జేఏసీ కన్వీనర్ కోల జనార్దన్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లపై గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ మాజీ ఎంపీ అజీజ్ పాషా మాట్లాడుతూ... దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందన్నారు. సామాజిక న్యాయం సాధించడమే లక్ష్యంగా బీసీలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతకై పార్లమెంట్లో బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేశారు.