గోదావరిఖనిలో రోడ్ల విస్తరణపై అభ్యంతరాలు

  •     72 క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఖాళీ చేయాలని సింగరేణి నోటీసులు
  •     ఆందోళనలో కార్మికులు, వారి కుటుంబాలు 

గోదావరిఖని, వెలుగు:  గోదావరిఖని పట్టణంలో రోడ్లను విస్తరించేందుకు సింగరేణి చర్యలు ప్రారంభించింది. ఈమేరకు గతంలో సంస్థ కేటాయించాలని క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 15 రోజుల్లో ఖాళీ చేయాలని సింగరేణి మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటీసులు జారీ చేసింది. కాగా తమకు మెరుగైన ప్రత్యామ్నాయాలు చూపకుండా ఎలా ఖాళీ చేస్తామని కార్మికులు, యూనియన్​ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారుల స్పందించడం లేదు. 

72 క్వార్టర్లు తొలగించాలని నోటీసులు

సింగరేణి 40 ఏండ్ల కింద కార్మికులకు హనుమాన్​నగర్​, అశోక్​నగర్​, శివాజీనగర్​, గాంధీ నగర్​ తదితర ప్రాంతాలలో క్వార్టర్లను నిర్మించింది. తాజాగా రోడ్ల విస్తరణ చేపట్టగా, హనుమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్​ అంగడి బడి నుంచి మెయిన్​ చౌరస్తా వరకు ఎడమ వైపున, అశోక్​నగర్​ మజీద్​ వద్ద నుంచి రీగల్​ షూమార్ట్​ వరకు ఎడమ వైపున, మెయిన్​ చౌరస్తా నుంచి శివాజీనగర్​ బట్టల దుకాణం వరకు ఎడమ వైపున, భారత్​ మెస్​ ముందు నుంచి మేదరబస్తీ మూలమలుపు వరకు ఎడమ వైపునున్న 72 క్వార్టర్లను తొలగిస్తామని సింగరేణి నోటీసులు ఇచ్చింది.

అలాగే సెక్టార్​ 2 పరిధిలోని విఠల్​నగర్​, తిలక్​నగర్, తదితర ప్రాంతాల్లోని క్వార్టర్లలో నివాసం ఉండాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ప్రత్యామ్నాయంగా చూపుతున్న క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నివాసయోగ్యంగా లేవని కార్మికులు వాపోతున్నారు. ప్రస్తుతమున్న క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.లక్షలు ఖర్చు పెట్టి ఫ్లోరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇతర పనులు చేయించామని, వాటిని ఖాళీ చేయమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. 

 క్వార్టర్ల కేటాయింపు కోసం కౌన్సెలింగ్​ చేపట్టాలి

సెక్టార్​ 1 ఏరియాలోని 72 సింగరేణి క్వార్టర్లను తొలగించడానికి నిర్ణయం తీసుకున్న మేనేజ్​మెంట్​ సెక్టార్​ 1 ఏరియాలోనే తిరిగి కార్మికులకు కేటాయించాలి. అలాగే క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సొంత ఖర్చుతో పనులు చేయించుకున్న కార్మికులను ఇబ్బంది పెట్టకుండా కౌన్సెలింగ్​ చేపట్టి వారు కోరుకున్న క్వార్టర్​ను ఇవ్వాలి. దీనికితోడు క్వార్టర్​కు పక్కన షెడ్లు నిర్మించాలి. ఉపాధి కోల్పోతున్న చిరువ్యాపారులకు షెడ్లు నిర్మించాలి. - మడ్డి ఎల్లాగౌడ్​, ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి