కత్తెర పురుగు ఉన్న మొక్కజొన్న పంట పరిశీలన

ఎర్రుపాలెం, వెలుగు: ఎర్రుపాలెం మండల పరిధిలోని పలు గ్రామాల్లో హైదరాబాద్​లోని అగ్రికల్చర్​యూనివర్సీటీ సైంటిస్టులు పర్యటించారు. వివిధ దశల్లో ఉన్న మొక్కజొన్న పంటలను పరిశీలించారు. సీనియర్ సైంటిస్ట్ బి.మల్లయ్య మాట్లాడుతూ.. మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు ఉందని చెప్పారు.

ఎకరా పంటకు 1000 మిల్లీ లీటర్ల స్పైనటోరియంను, 200 లీటర్ల నీటితో స్ప్రే చేస్తే కత్తెర పురుగు పోతుందని తెలిపారు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే 9పాలుల ఇసుక ఒక పాళం సున్నం కలిపి మొక్క ఎత్తు తక్కువగా ఉన్నప్పుడు, సుడులలో వేయాలని సూచించారు. దిగుబడి పెరగాలంటే, కంకి గింజ పోసుకునే దశలో యూరియా, పొటాష్​వేయాలని చెప్పారు. అగ్రికల్చర్ జిల్లా టెక్నికల్ ఆఫీసర్ చాయరాజ్, మండల ఏఓ విజయభాస్కర్ రెడ్డి, ఏఈఓలు జిష్ణు, బాలకృష్ణ, పలువురు రైతులు పాల్గొన్నారు.