
బోధన్, వెలుగు: మార్చి 1 నుంచి 8వరకు అంతర్జాతీయ మహిళ పోరాట దినంగా పాటించాలని ప్రగతశీల మ హిళ సంఘం బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి.నాగమణి సూచించారు. పట్టణంలోని రాకాసిపేట్ లో పోస్టర్లను అవిష్కరించారు. మహిళల హక్కుల కోసం ఎంతోమంది పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసినా.. నేటికి మహిళలు పనిచేసే స్థలాల్లో కనీస సౌకర్యాలు లేవన్నారు.
మహిళలకు పూర్తిగా హక్కులు వచ్చిన రోజునే.. అంతర్జాతీయ మహిళ పోరాటదినంగా జరపాలని పిలుపునిచ్చారు. మార్చి8 వరకు వ్యతిరేకంగా సభలు, ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళ సంఘం నాయకులు రేహనా బేగం, ఆర్. లక్ష్మి, కె.పద్మ, బి.యాదమమ్, ఎస్.పోశవ్వ, అరుగొండ లత, సుజాత, కమల, నాగమణి తదితరులు పాల్గొన్నారు.