![హైదరాబాద్ డీఎంహెచ్ వో ఆధ్వర్యంలో.. రక్తదాన శిబిరం](https://static.v6velugu.com/uploads/2023/10/occasion-Gandhi-Jayanti-blood-donation-camp-organized-office-Hyderabad-District-Medical-Health-Department_SmwsXYy6QC.jpg)
సికింద్రాబాద్, వెలుగు : గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట్ తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్, హరిహరా కళాభవన్ వద్దనున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి
ఆఫీసులో శిబిరం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆసక్తి కలవారు రక్తదానం చేసేందుకు క్యాంప్ ఇన్ చార్జి శ్రీనివాస్ 9603408759కు ఫోన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.