కాజీపేట, వెలుగు : తెలంగాణ ఏర్పడిన తర్వాత ఓ వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధితో పాటు అనేక చారిత్రక కట్టడాలు, ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చెప్పారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాల సందర్భంగా హనుమకొండ జిల్లా కాజీపేట బోడగుట్ట వద్ద ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్‌ను శుక్రవారం కలెక్టర్ సిక్నా పట్నాయక్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ ట్రెక్కింగ్, అడ్వెంచర్ క్లబ్ సహకారంతో బోడగుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. వరంగల్ నగరం ఎడ్యుకేషనల్, ఐటీ, హెల్త్ హబ్‌గా మారందని, భవిష్యత్‌లో టూరిజం హబ్‌గా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అనంతరం ఎవరెస్ట్ అధిరోహించిన అన్విత, ఆనంద్, అఖిల్‌ను సన్మానించారు.