కోనరావుపేట, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఎస్ఎంసీ చైర్మన్ నాగరాజు.. నూతనంగా నిర్మించిన బాత్రూమ్స్ కి మంగళవారం వాటర్ పైప్ లైన్ కనెక్షన్ పనులు చేస్తుండగా క్షుద్రపూజలు చేసినన ఆనవాళ్లను గమనించాడు. వెంటనే స్థానికులకు సమాచారం అందించాడు.
స్కూల్ లోని శిథిలావస్థలో ఉన్న కిచెన్ షెడ్ లో స్థానికులను భయపెట్టేందుకు దుండగులు క్షుద్రపూజలు చేసినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షుద్రపూజలు చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.