ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ప్రభుత్వ బడిలో క్షుద్రపూజలు చేసిన సంఘటన జగిత్యాల జిల్లా బీమారం మండలంలో చోటుచేసుకుంది.రాత్రివేళ తాళం వేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఆఫీస్ ముందు..పసుపు, కుంకుమలతో ముగ్గు వేసి..చుట్టూ నిమ్మకాయలు పెట్టి మధ్యలో కోడిగుడ్డును ఉంచిన క్షుద్రపూజలు చేసినట్లు తెలుస్తోంది. ఉదయం బడికి వచ్చిన అంటెండర్.. వాటిని చూసి ఆందోళన చెంది గ్రామస్థులకు తెలిజేసింది.
ఈ క్షుద్రపూజలు గ్రామంలో భయాందోళనకు గురిచేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామాస్తులు. దీంతో స్కూల్ దగ్గరకు చేరుకుని పరిశీలించిన పోలీసులు.. ఇది నిజంగా క్షుద్రపూజలు చేశారా, లేక ఆకతాయిల పనా అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.