![జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో క్షుద్ర పూజల కలకలం](https://static.v6velugu.com/uploads/2025/02/occult-worships-abuzz-in-jayashankar-bhupalpally-district_iT2LP4nDrO.jpg)
మల్హర్, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్లలో పెద్దమ్మ గుడి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి క్షుద్ర పూజల కలకలం లేపాయి. సోమవారం తెల్లవారుజామున గొర్రె పిల్లను బలిచ్చి, పసుపు, నిమ్మకాయ, కుంకుమలతో భయంకరంగా కనిపించిన ఈ దృశ్యాన్ని చూసి గ్రామస్తులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ విషయమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.