కబ్జా భూములను ప్రభుత్వానికి అప్పగిస్తా.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్, వంజరిపల్లి గ్రామాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి   కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి నర్సింగ్ పూర్ కు అప్పగించి, ఐకేపీ కొనుగోలు కేంద్రానికి ఐదు ఎకరాలకు కేటాయిస్తామన్నారు.నర్సింగాపూర్ గ్రామంలోని ప్రభుత్వ భూములపై కేవలం నర్సింగాపూర్ గ్రామస్తులకే హక్కు కల్పిస్తామన్నారు. గుంట భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వనని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు.  ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం ఉగాది పండుగ నాటికి మాస్టర్ ప్లాన్ తో జగిత్యాల పరిసర గ్రామాలకు సంబంధం లేకుండ పట్టణానికే పరిమితం చేస్తానన్నారు. తెలంగాణ అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.