ఫుట్ ఫాత్ ల‌ను ఆక్ర‌మిస్తే క‌ఠిన‌ చ‌ర్య‌లు

ఫుట్ ఫాత్ ల‌ను ఆక్ర‌మిస్తే క‌ఠిన‌ చ‌ర్య‌లు

హైద‌రాబాద్: వాణిజ్య సముదాయాల ముందు ఉన్న ఫుట్ ఫాత్ ల‌ను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందున్న లోకల్ బస్ స్టాప్ ను మోడల్ బస్ స్టేషన్ గా ఆదునికరించే పనులను గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక మొండా మార్కెట్ కార్పొరేటర్ ఆకుల రూప, మున్సిపల్, ట్రాఫిక్, లా అండ్ ఆర్థర్ పోలీసు అధికారులతో కలిసి పర్యవేక్షించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వమే అన్ని చేయాలంటే కుదరదు.. నేను బాగుండాలి, నా పరిసర ప్రాంతాలు బాగుండే విదంగా చూసుకోవాల్సిన బాధ్యత తనదే అన్న చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలని తెలిపారు. వందల కోట్లు ఖర్చు చేసి రోడ్లు, ఫుట్పాత్, పరిసర ప్రాంతాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. దానిని కాపాడు కోవలసింది పోయి వాటినే దుర్వినియోగం చేస్తే సహించేది లేదని అన్నారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృధ్ధి జరుపుతున్నామని పేర్కొన్నారు. చిన్న వ్యాపారస్తుల పొట్ట కొట్టమని.. అందరిని సంతోషంగా ఉంచడమే తెలంగాణ ప్రభుత్వ ద్యేయమని తెలిపారు మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్.