ఆర్టీసీ భూమిని ఆక్రమించుకుంటే సహించేది లేదు

ఆర్టీసీ భూమిని ఆక్రమించుకుంటే సహించేది లేదు
  • టీఎంయూ ప్రధాన కార్యదర్శి ఏఆర్ రెడ్డి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ భూమిని ఆక్రమించుకుంటే సహించేది లేదని టీఎంయూ ప్రధాన కార్యదర్శి ఏఆర్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్మన్, సిబ్బందితో బస్టాండ్ ఖాళీ స్థలాన్ని దౌర్జన్యంగా లాక్కోవలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. బస్టాండ్ స్థలంలో సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్టాండ్ కి చెందిన 2 ఎకరాల 13 గుంటల స్థలం మీద మున్సిపల్ చైర్మన్ కన్ను పడిందని విమర్శించారు. డిపో మేనేజరుతో దురుసుగా ప్రవర్తించి అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన చైర్మన్ పద్ధతి మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. డిపో మేనేజరు ఆంజనేయులు పై పెట్టిన కేసును ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 
అధికారం ఉందని డిపో మేనేజర్ ను తిట్టడం సంస్కారం కాదని సూచించారు. ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ, మీకు ఎలాంటి హక్కులు ఉండవని గుర్తుంచుకోవాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సహనాన్ని కించపరిస్తే రాష్ట్రం మొత్తం బస్సులు బంద్ చేసి నిర్మల్ లో నిరాహార దీక్ష చేస్తామని ఏఆర్ రెడ్డి హెచ్చరించారు.