సాధారణంగా మహాలయ అమావాస్య చాలా విశిష్టమైనది. ముఖ్యంగా ఈ ఏడాది మహాలయ అమావాస్య ( అక్టోబర్ 14) మరింత ప్రత్యేకం. ఎందుకంటే 2023 లో రెండో సూర్యగ్రహణం ఈ నెల అక్టోబర్ 14 వ తేదీన ఏర్పడుతోంది. సూర్యగ్రహణం మేష రాశి నుండి మీన రాశి వరకు అన్ని రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. అయితే ముఖ్యంగా 3 నక్షత్రాల రాశుల వారు ఈ సూర్యగ్రహణం కారణంగా అదృష్టవంతులు అవుతారు.. ఆ అదృష్ట రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
సర్వ పితృ అమావాస్య నాడు సింహ రాశి గల జాతకులకి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రాసి గల జాతకులు ధన లాభాలను పొందుతారు. మీ జీవితంలో సంతోషం మరియు శ్రేయస్సు వెల్లివిరుస్తాయి. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితం ఐశ్వర్యం మరియు ఆనందంతో నిండి ఉంటుంది. మీ సంబంధాలు మరింత బలపడతాయి.
వ్యాపారంలో పురోభివృద్ధి ఉంటుంది. పెట్టిన పెట్టుబడులు అధిక లాభాలను ఆర్జించే సమయం ఇది. సింహరాశి 2 వ ఇంట్లో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీని వల్ల ఈ రాశి వారికి ఆదాయం బాగుంటుంది. మీకు దేనికీ లోటు అనేదే ఉండేది. జీవితం చాలా సంతోషంగా ఉంది. వ్యాపారస్తులకు అదృష్టం లాభిస్తుంది. కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా మరియు మధురంగా ఉంటుంది. మీరు ఈ కాలంలో పెట్టుబడి పెట్టినట్లయితే, మీరు అధిక లాభం పొందుతారు. మిధున రాశి వారికి సర్వ పితృ అమావాస్య నాడు సూర్యుని యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి.
మిథున రాశి వారి ఆరోగ్యం మెరుగు పడుతుంది. విశ్వాసం పెరుగుతుంది. మిథునం 4 వ ఇంట్లో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అందువలన ఈ రాశికి చెందిన జాతకులు ఈ గ్రహణం నుండి సూర్యుని ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారు. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ పని ప్రశంసించబడుతుంది. కొందరికి పదోన్నతి లభించవచ్చు. ఉద్యోగులు తమ పనిలో విజయం సాధించే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో నెంబర్ వన్ గా రాణిస్తారు. పరీక్షల్లో మంచి మార్కులను సంపాదిస్తారు. కొత్త ఆదాయ వనరులు వచ్చే అవకాశం ఉంది. మీరు అన్నింటా విజయ అవకాశాలను అందుకుంటారు.
పూర్వీకుల యొక్క అనుగ్రహం వల్ల ఉద్యోగం చేసే వారికి శ్రమకి తగిన ఫలితం దక్కుతుంది. ఉద్యోగంలో మీ పని ఉన్నతాధికారులతో ప్రశంసించ బడుతుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశలు ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి. పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న మిధున రాశి వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. తులా రాశి వారికి సర్వ పితృ అమావాస్య మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీపై పూర్వీకుల మరియు ముఖ్య గ్రహాల అనుగ్రహం ఉంటుంది. జీవితంలోని అన్ని రంగాలలోనూ మీరు విజయం సాధిస్తారు. సంపద, ఆరోగ్యం, భౌతిక సుఖాలు, ఆనందం ఈ సమయంలో బాగా కనిపిస్తాయి.
తులా రాశికి చెందిన వ్యాపారులు ప్రత్యేక ప్రయోజనాల్ని పొందుతారు. తులారాశి 12 వ ఇంట్లో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అందువలన ఈ రాశి చక్రం యొక్క జాతకులు మీ పనిలో గొప్ప గొప్ప విజయాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితిలో మంచి పురోగతి ఉంటుంది. మీకు ఆర్ధికంగా ఎలాంటి లోటు ఉండదు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు, జీతాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ కాలం శ్రేష్ఠమైనది. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశాలు లభిస్తాయి. పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.