పత్తి (కాటన్) యొక్క ప్రాధాన్యతను...ప్రాముఖ్యతను గుర్తించడంతో పాటు..పత్తిపై అవగాహన పెంచడానికి ప్రతి ఏడాది అక్టోబర్ 07 న ప్రపంచ పత్తి దినోత్సవం జరుపుకుంటారు. పత్తిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత దేశం ఒకటి. ప్రపంచం మొత్తంగా భారతే 40% పత్తిని పండిస్తోంది. దేశంలో పత్తి పంట దాదాపు 6.00 మిలియన్ పత్తి రైతులకు జీవనోపాధిని అందిస్తోంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారు, అతిపెద్ద వినియోగదారుగా భారతదేశం కొనసాగుతోంది. పత్తి గింజలు, పత్తి ఫైబర్ను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ అగ్రగామిగా ఉంది. వైద్య రంగం, పశుగ్రాసం, వంటనూనే పరిశ్రమలతో పాటు..వస్త్ర పరిశ్రమకు పత్తే ముడిసరుకు.
మొదటి పత్తి దినోత్సవం..
2019లో మొదటి సారిగా పత్తి దినోత్సవాన్ని నిర్వహించారు. జెనీవాలో అంతర్జాతీయ పత్తి సలహా కమిటీ, ప్రపంచ వాణిజ్య సంస్థ పత్తి దినోత్సవాన్ని మొదలు పెట్టాయి. కాటన్ ఉత్పత్తి చేసే నాలుగు దేశాలైన బెనిన్, బుర్కినా ఫాసో, చాడ్, మాలి .. ప్రపంచ పత్తి దినోత్సవం కోసం ఆగస్టు 30 న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి అధికారిక ప్రతిపాదన చేశాయి.
ప్రపంచ పత్తి దినోత్సవం 2022 థీమ్
పత్తికి మంచి భవిష్యత్ ను ఇవ్వడం ప్రపంచ పత్తి దినోత్సవం 2022 థీమ్. అంతేకాకుండా ప్రపంచ పత్తి దినోత్సవం పత్తిని సాగు చేసే రైతులు, కూలీలు, వారి కుటుంబాల జీవితాలను మెరుగుపరచడం.
ప్రపంచ పత్తి దినోత్సవం ప్రాముఖ్యత ఏమిటి ?
పత్తి ఉత్పత్తి,మార్కెటింగ్ గురించి పత్తి రైతులు, పరిశోధకులు, ప్రాసెసర్లు,ఇతర వాటాదారులకు తెలియజేయడం కోసం ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రపంచ పత్తి దినోత్సవం..రైతులు, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక అభివృద్ధికి ప్రేరణనిస్తుంది.
ప్రపంచ పత్తి దినోత్సవం చరిత్ర
పత్తి ఉప ఉత్పత్తిదారుల చొరవతో పత్తి సాగును అభివృద్ధి చేయడం, పత్తిసాగును ప్రోత్సహించడమే లక్ష్యంగా , ప్రపంచ వాణిజ్య సంస్థ, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్, ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ ప్రతీ ఏడాది ప్రపంచ ప్రత్తి దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.