
ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్, ఆక్టోపస్ ఎస్పీ రాధిక అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఆస్ట్రేలియాలోనే అత్యంత ఎత్తైన శిఖరం కార్ స్టెంజ్ పిరమిడ్ ను ఆమె మార్చి 20న ఉదయం 10 గంటలకు అధిరోహించారు. పపువా న్యూగినియాలో ఈ అత్యున్నత శిఖరం ఉంది. ప్రపంచంలోని ఏడు అత్యున్నత పర్వత శిఖరాలు అధిరోహించే సవాల్ లో భాగంగా ఆమె ఆస్ట్రేలియాలోని హయ్యెస్ట్ పీక్ పై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు.
ఈ ఘనత సాధించడంలో తనను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్యాన్ని సాధించే క్రమంలో డిపార్టుమెంట్ తనకు మద్దతుగా ఉందని ఆమె అన్నారు.