తమన్నా బర్త్ డే స్పెషల్.. ఓదెల 2 నుంచి కొత్త పోస్టర్

తమన్నా బర్త్ డే స్పెషల్.. ఓదెల 2 నుంచి కొత్త పోస్టర్

ఓ వైపు స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్, గ్లామరస్ రోల్స్‌‌‌‌తో పాటు  లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌‌‌‌తో  ఆకట్టుకుంటోంది తమన్నా. ప్రస్తుతం ఆమె ‘ఓదెల రైల్వే స్టేషన్’ సీక్వెల్‌‌‌‌లో లీడ్ రోల్‌‌‌‌ చేస్తోంది. ‘ఓదెల 2’ టైటిల్‌‌‌‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దర్శకుడు సంపత్ నంది కథను  అందించగా, అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు.  శనివారం తమన్నా పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు విషెస్ తెలియజేసిన టీమ్.. కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. 

ఇందులో నాగ సాధు (శివ శక్తి)  పాత్రలో తమన్నా లుక్ ఫెరోషియస్‌‌‌‌గా ఉంది. ధైర్యమే ఆయుధంగా ఆమె  పుర్రెలపై నడుస్తుండగా, రాబందులు పైన ఎగురుతుండటం క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ పోస్టర్  ఆమె పాత్రలోని  పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ నేచర్‌‌‌‌‌‌‌‌ని సూచిస్తోంది. తన పాత్ర కోసం తమన్నా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకుంది. ఈ చిత్రంలో  హెబ్బా పటేల్, వశిష్ట ఎన్‌‌‌‌ సింహ, యువ, నాగ మహేష్, గగన్ విహారి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  మల్టీ లింగ్వల్ ప్రాజెక్టుగా  రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్,  సంపత్ నంది టీమ్‌‌‌‌వర్క్స్ బ్యానర్‌‌‌‌లపై డి మధు  నిర్మిస్తున్నారు.  అజనీష్ లోక్‌‌‌‌నాథ్  సంగీతం అందిస్తున్నాడు.