బీఆర్ఎస్​ కుట్రలకు వివేక్​ భయపడరు..కాంగ్రెస్ లీడర్లు నిరసన

  •     కాంగ్రెస్ ​ఓదెల మండల లీడర్లు 

పెద్దపల్లి, వెలుగు : బీఆర్ఎస్​, సీఎం కేసీఆర్​ కుట్రలకు చెన్నూరు కాంగ్రెస్​అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి భయపడరని, లక్షల మంది కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారని కాంగ్రెస్ ​ఓదెల మండల లీడర్లు స్పష్టం చేశారు. వివేక్ ​వెంకటస్వామి ఇండ్లు, ఆఫీసులపై ఐటీ, ఈడీ దాడులను ఖండిస్తూ పెద్దపల్లి జిల్లా ఓదెలలో  బుధవారం కాంగ్రెస్ లీడర్లు నిరసన చేపట్టారు.

లీడర్లు మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలో వివేక్​ వెంకటస్వామి భారీ మెజార్జీ గెలుస్తున్నారనే సంకేతాలతోనే కేసీఆర్​సర్కార్​ దాడులు చేయిస్తోందన్నారు. లీడర్లు అల్లం సతీశ్‌‌‌‌, లక్ష్మి, చిన్నస్వామి, గోపతి సదానందం, వీరయ్య, రాజయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు

 వివేక్ వెంకటస్వామి ఇంటిపై దాడి గర్హనీయం 

కోరుట్ల, వెలుగు : వివేక్​ వెంకటస్వామి ఇంటిపై ఐటీ అధికారుల దాడులు హేయనీయమని కాంగ్రెస్  సీనియర్ లీడర్​ జువ్వాడి  కృష్ణారావు అన్నారు. బుధవారం కోరుట్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేక్ నీతి నిజాయతీకి మారుపేరని, ఆయనపై ఐటీ దాడులు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మైత్రికి నిదర్శనమన్నారు.

చెన్నూరులో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి,  బీఆర్ఎస్​, బీజేపీ  కుట్రలు చేశాయని ఆరోపించారు. దళిత నేత వివేక్ వెంకటస్వామిపై బీజేపీ ఎంపీ  ధర్మపురి అర్వింద్ ​కక్షగట్టారని ఆరోపించారు.