భారత్‌లో పర్యటించేందుకు పాకిస్థాన్, ఆ దేశ క్రికెట్ బోర్డు రోజుకో కొత్త రాగం అందుకుంటున్నాయి. మొదట ప్రభుత్వం అనుమతి ఇస్తేనే జట్టును భారత్‌కు పంపిస్తామని చెప్పిన పీసీబీ.. ఆ తర్వాత ఈ విషయంపై పాక్ ప్రభుత్వం విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ ప్రత్యేక కమిటీ పాకిస్తాన్.. వరల్డ్ కప్ ఆడేందుకు రావాలంటే ఐసీసీ రాతపూర్వక హామీ ఇవ్వాలని పట్టుబడుతోంది.
వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభమవ్వడానికి ఇంకో రెండు నెలల గడువు మాత్రమే ఉంది. అయిటినప్పటికీ.. ఈ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్ జట్టు ఇండియా వస్తుందా? రాదా? అన్నదానిపై స్పష్టత లేదు. పాకిక్ జట్టు భారత్‌కు రావాలంటే ముందుగా అక్కడి ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఇప్పటివరకూ అలాంటి వివరాలేవీ బయటకి రాలేదు. మొండివైఖరి ప్రదర్శిస్తోంది.
పాక్ ప్రధాని అధ్యక్షతన కమిటీ
పాక్ ప్రభుత్వం విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ బుధవారం(ఆగస్ట్ 2) సమావేశమై పాక్ జట్టు భద్రతకు సంబంధించి ఐసీసీ నుంచి లిఖిత పూర్వకంగా హామీ కోరినట్లు తెలుస్తోంది. అందుకు అంగీకరిస్తేనే జట్టును భారత్ పంపేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
జెడ్ సెక్యూరిటీ
2016 టీ20 వరల్డ్ కప్ సమయంలో పాకిస్తాన్ జట్టుకి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారో, అదే విధమైన భద్రతా ఏర్పాట్లు ఇప్పుడు కల్పించాలన్నది పీసీబీ డిమాండ్. అంటే దాదాపు జెడ్ సెక్యూరిటీ ఉంటేనే, ఇండియాలో అడుగుపెడతామని తేల్చి చెబుతోంది.
ఆసియా కప్ 2023 కోసం భారత జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించిన సంగతి తెలిసిందే. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్న పాక్.. ఈ విధమైన వైఖరి అవలంభిస్తోంది. కాగా, అక్టోబర్ 15న దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండడంతో అహ్మదాబాద్ వేదికగా జరగాల్సిన ఇండియా- పాక్ మ్యాచ్ ను అక్టోబర్ 14కి రీషెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.