భర్త రాణించాడు.. భార్య పొగిడింది.. అందులో ఏముందంటారా! అందులోనే ఉంది అసలు కథ. సమాజంలో ఎంత మంది భర్తలు ఉన్నత స్థానాలకు చేరుకోవట్లేదు
.. మరి వారి భార్యలు అందరు పొగుడుతున్నారా! పొగడరు. అలాంటి మనసు కొందరికే ఉంటుంది. అందులో మన రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఒకరు. జట్టు కోసం తన భర్త శ్రమించే తీరు, పోరాడే తత్వాన్ని వర్ణిస్తూ ఆమె కోహ్లీపై పొగడ్తలు కురిపించింది. స్మార్ట్ చేజర్ అంటూ సరికొత్తగా వర్ణించింది.
ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. కోహ్లీ(95) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌కు షమి ఐదు వికెట్లతో చెలరేగడంతో భారత జట్టు.. 20 ఏళ్ల తర్వాత వరల్డ్‌క్‌పలో కివీ్‌సపై గెలుపు బావుటా ఎగరువేసింది. 191 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును అతడు రవీంద్ర జడేజా(39) సహకారంతో విజయానికి చేరువచేయడం ఈ మ్యాచ్ లోనే హైలెట్. తృటిలా సెంచరీ చేజారినా.. కోహ్లీ ఇన్నింగ్స్ మ్యాచ్ విన్నింగ్ నాక్ అని చెప్పుకోవాలి. అందుకే భర్త ఇన్నింగ్స్‌ను తలుచుకొని అనుష్క గర్వపడుతూ ట్వీట్ చేసింది.
Also Read : IND vs NZ: రోహిత్ -కోహ్లీ మధ్య వాగ్వాదం.. మ్యాచ్ మధ్యలో ఏం జరిగిందంటే..?
India ?? make it FIVE in a row!
— BCCI (@BCCI) October 22, 2023
Ravindra Jadeja with the winning runs ??
King Kohli ? reigns supreme in yet another run-chase for #TeamIndia ?#CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/d6pQU7DSra
"మీలో శక్తి తగ్గదు.. మీ పోరాటంలో మార్పు ఉండదు. మీ గురించి ఎల్లప్పుడూ గర్వంగా ఉంటుంది.. స్మార్ట్ చేజర్.." అంటూ అనుష్క సరికొత్తగా వర్ణించింది. ఈ స్టోరీని కోహ్లీ అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు.