ODI World Cup 2023: కావాలనే తప్పించారా!: బీసీసీఐని ఉద్దేశిస్తూ అక్షర్ పటేల్ సంచలన పోస్ట్

ODI World Cup 2023: కావాలనే తప్పించారా!: బీసీసీఐని ఉద్దేశిస్తూ అక్షర్ పటేల్ సంచలన పోస్ట్

భారత వరల్డ్ కప్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకున్న విషయం విదితమే. గాయం నుంచి పూర్తిగా కోలుకుని అక్షర్‌ పటేల్‌ స్థానంలో వెటరన్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఎంపిక చేశారు.. సెలెక్టర్లు. ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌‌లో గాయపడ్డ అక్షర్‌ కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశముండటంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ నిర్ణయంపై అక్షర్‌ పటేల్ సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

"కామర్స్ బదులు సైన్స్ చదివి ఉంటే బాగుండేది. అంతకూ కాదంటే ఓ మంచి పీఆర్‌ను పెట్టుకొని ఉంటే ఇంకా బాగుండేది..' అని అక్షర్‌ పటేల్‌ తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నారు. ఈ కామెంట్ కు గుండెపగిలిన హార్ట్ సింబల్ ఏమోజిని జత చేశారు. అయితే వెంటనే అతను ఈ పోస్ట్‌ డిలీట్ చేయటం పలు అనుమానాలకు తావిస్తోంది. అతన్ని కావాలనే తప్పించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాయం నుంచి కోలుకున్నా.. అశ్విన్‌ను ఆడించాలనే ఉద్దేశంతో అతన్ని తప్పించారనే ప్రచారం సాగుతోంది.

ALSO READ: Asian Games: తినండి.. బాగా తినండి: చైనీస్ వంటకాల రుచి చూస్తున్న భారత క్రికెటర్లు

బీసీసీఐతో పాటు టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టినట్లుగా ఈ ఈ పోస్ట్ ఉండటం అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో అంబటి రాయుడు, వృద్దిమాన్ సాహా వంటి పలువురు క్రికెటర్లు ఇలానే మేనేజ్మెంట్‌ను నిలదీసి జట్టుకు దూరమైన విషయాలను ప్రస్తావిస్తున్నారు.

భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహమ్మద్ షమి, రవిచంద్రన్ అశ్విన్‌.