ఒకవైపు వరల్డ్ కప్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతుంటే.. మరోవైపు ఐకానిక్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్‌లో అశుభం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ స్టేడియం వెలుపలి గోడలో ఒక భాగం కూలిపోయింది. మట్టి తవ్వే యంత్రం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో హుటాహుటీన బీసీసీఐ అధికారులు అక్కడికి చేరుకున్నారు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొత్తం ఐదు మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, శనివారం నెదర్లాండ్స్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అందుకు 24 గంటల సమయంలో కూడా లేదు. ఈ సమయంలో ఇలాంటి ఘటనచోటుచేసుకోవడం బీసీసీఐకి కొత్త తలనొప్పులు తెస్తోంది. కూలిన గోడ స్టేడియం లైటింగ్ టవర్‌లలో ఒకదానికి చాలా దగ్గరగా ఉంది. వీలైనంత త్వరగా మరమ్మత్తులు చేయడానికి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్, బీసీసీఐ అధికారులు ప్రయత్నాలు జరుపుతున్నారు.
In a great headache to the BCCI and CAB, a portion of the Eden Gardens stadium’s outside wall crumbled on Thursday.The wall collapsed due to an earthmoving machine colliding with it. pic.twitter.com/lohEzgWMVq
— Satyyy (@Satyyy0006) October 27, 2023
ఈడెన్ గార్డెన్స్ సఆతిథ్యమివ్వనున్న మ్యాచ్‌లు
- అక్టోబర్ 28: నెదర్లాండ్స్ vs బంగ్లాదేశ్
- అక్టోబర్ 31: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్
- నవంబర్ 5: ఇండియా vs దక్షిణాఫ్రికా
- నవంబర్ 11: ఇంగ్లండ్ vs పాకిస్థాన్
- నవంబర్ 16: సెమీ-ఫైనల్ మ్యాచ్