ODI World Cup 2023: కోహ్లీపై పొగడ్తలు.. అతని కంటే రోహిత్ గొప్పవాడన్న గంభీర్

కోహ్లీ vs గంభీర్‌.. వీరిద్దరికి పడదని క్రికెట్ చూసే ప్రతి అభిమానికి తెలుసు. కనపడినప్పుడు పలకరింపులు, షేక్ హ్యాండ్‌లు గట్రా ఇచ్చుకున్నా..లోలోపల మాత్రం పాము-ముంగిస టైప్. అలా అని కనపడగానే పోట్లాడురగా అనకండి!. లోలోపల మంట అలానే ఉంటది. తాజాగా, ఆ విషయం మరోసారి బయటపడింది. స్టార్‌ స్పోర్ట్స్‌లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్.. కోహ్లీపై పొగడ్తలు వినలేక హోస్ట్ పై మండిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇండియా vs ఇంగ్లాండ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు గంభీర్ స్టార్ స్పోర్ట్స్ ప్రీ-మ్యాచ్ షోలో పాల్గొన్నాడు. ఈ షో మొదలవ్వగానే హోస్ట్ మయంతి లాంగర్‌.. విరాట్ కోహ్లీపై పొగడ్తలు మొదలుపెట్టింది. కోహ్లీ ఫామ్ చూస్తుంటే.. 48 సెంచరీలతో ఉన్న కోహ్లీ ఈ మ్యాచ్‌లో మరో శతకం బాది భారత మాజీ దిగ్గజం సచిన్ రికార్డు(వన్డేల్లో 49 సెంచరీలు) సమం చేస్తారని చెప్పుకొచ్చింది. అంతటితో ఆగిందా! అదీ లేదు. అతని గణాంకాలు, వ్యక్తి గత రికార్డుల గురుంచి పెద్ద ఉపన్యాసం ఇచ్చింది. 

అంత పబ్లిసిటీ అక్కర్లేదు..!

కోహ్లీపై పొగడ్తలు విన్నంత సేపు విన్న గంభీర్.. కొద్దిసేపటి అనంతరం అతన్ని టార్గెట్ చేస్తూ పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రదర్శన గురించి మాట్లాడటానికి ఇష్టపడతానన్న గంభీర్.. వరల్డ్‌ కప్‌ బ్రాడ్ కాస్టర్‌గా ఉన్న స్టార్‌ స్పోర్ట్స్‌ కోహ్లీ రికార్డులపై  అధిక ప్రచారం కల్పిస్తుందని మాట్లాడారు. పైగా అతన్ని కంటే రోహిత్ గొప్పవాడని పొగిడారు. రోహిత్‌ రికార్డుల వెంట పడరని చెప్పిన గంభీర్.. ఒకవేళ అతడు నిజంగా గణాంకాల కోసం ఆడి ఉంటే ఇప్పటికి 40-45 సెంచరీలు చేసుండేవాడు.." అని వ్యాఖ్యానించాడు. గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు.

ALSO READ :- మెగా డాటర్ క్లింకార ఫేస్ రివీల్.. కనబడకుండా చాలా ట్రై చేశారు