IND vs PAK: ఓడిపోతామన్న భయం.. పాకిస్తాన్ పాటలు పెట్టొద్దని రోహిత్ చెప్పాడు: మాజీ క్రికెటర్

IND vs PAK: ఓడిపోతామన్న భయం.. పాకిస్తాన్ పాటలు పెట్టొద్దని రోహిత్ చెప్పాడు: మాజీ క్రికెటర్

దాయాదుల పోరు ముగిసి వారం రోజులు కావొస్తున్నా వివాదాలు మాత్రం సద్దుమణగడం లేదు. ఆటకు వీడ్కోలు పలికిన మాజీలు ఏదో ఒక విషయాన్ని బయటకు లాగుతూ గొడవలు మరింత పెద్దవి చేయాలి చూస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ అలాంటి వ్యాఖ్యలే చేశాడు. 

అహ్మదాబాద్ వేదికగా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌లో వారికి మద్దతుగా ఆ దేశ పాటలు పెట్టకపోవడం పట్ల పాక్ టీం డైరెక్టర్ మికీ ఆర్థర్ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఐసీసీ ఈవెంట్ లాగా కాకుండా.. బీసీసీఐ ఈవెంట్ లాగా ఉందని వ్యాఖ్యానించాడు. పైగా మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు ఎక్కడా దిల్ దిల్ పాకిస్థాన్ అనే నినాదాలు వినిపించలేదని మాట్లాడారు. తాజాగా ఈ విషయపై ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మైకేల్ వాన్.. మిక్కీ ఆర్థర్‌ను ట్రోల్ చేసేలా వ్యాఖ్యానించాడు.

వాన్ సెటైర్లు 

పాకిస్తాన్ పాటలు ప్లే చేయకపోవడం వెనుక హస్తముందన్న వాన్.. అతని కోరిక మేరకే డీజే ఆ సాంగ్ పెట్టలేదని సెటైర్లు వేశాడు. 'ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీతో పాటు అతని వ్యూహాలు గురుంచి కూడా చెప్పుకోవాలి. మ్యాచ్‌లో దిల్ దిల్ పాకిస్తాన్ సాంగ్ ప్లే చేయొద్దని రోహిత్‌ డీజేను కోరాడు. ఒకవేళ సాంగ్ ప్లే చేస్తే పాకిస్తాన్ గెలుస్తుందని డీజేకు చెప్పాడు. అందుకే వారికి మద్దతుగా సాంగ్ ప్లే చేయలేదు.." అంటూ వాన్ సెటైర్లు వేశాడు.

అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.