ఇప్పుడు పొగడటం కాదు.. అప్పుడు ఎన్నేసి మాటలు అన్నారో నాకు తెలుసు: బుమ్రా

ఇప్పుడు పొగడటం కాదు.. అప్పుడు ఎన్నేసి మాటలు అన్నారో నాకు తెలుసు: బుమ్రా

గాయం నుంచి తిరిగొచ్చాక భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. భారత పేస్ దళాన్ని ముందుండి నడపడమే కాదు.. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. నిజానికి గతంలో కంటే ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారాడు. ఆడిన 6 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. ఇలా రాణిస్తున్నప్పుడు పొగుడుతున్నారు బాగానే ఉంది.. మరి గాయం కారణంగా జట్టుకు దూరమైన సమయంలో తనను తిట్టిన నోర్లు ఏమని సమాధానం చెప్తాయన్నట్లు స్పందించారు.. బుమ్రా. 

ఐపీఎల్ మాత్రమే ఆడతాడు

గాయం కారణంగా బుమ్రా జట్టుకు దూరమైన సమయంలో అతన్ని విమర్శించని నోరు లేదు. కథనాలు రాయని వార్తా పత్రిక లేదు. భారత పేసర్లు విఫలమైన ప్రతి చోటా అతని పేరే ముందుండేది. జట్టులో లేకపోయినా ఓటములకు అతనే బాధ్యుడు అన్నట్లు విమర్శించేవారు. ఐపీఎల్‌కు అడ్డురాని గాయాలు.. దేశానికి ఆడే సమయంలో మాత్రమే ఎందుకు అడ్డొస్తాయని అతన్ని ప్రశ్నించేవారు. అప్పట్లో మీడియా సైతం విమర్శకుల పక్షానే ఉండేది. బుమ్రా దేశానికి ఆడడు.. ఐపీఎల్ మాత్రమే ఆడతాడు అంటూ పెద్ద పెద్ద హెడ్డింగ్‌లతో కథనాలు వచ్చేవి. ఈ  విమర్శలపై బుమ్రా ఇప్పుడు స్పందించారు.

జట్టుకు దూరమైన సమయంలో తన కెరీర్‌ గురుంచి పలువురు అన్న మాటలను గుర్తుచేసుకున్నాడు బుమ్రా. "నా భార్య(సంజన గణేషన్) స్పోర్ట్స్ మీడియాలో పని చేస్తుంది. అందువల్ల, నా గురుంచి ఎవరు ఏమన్నా నాకు తెలిసిపోయేవి. నా కెరీర్‌కు సంబంధించి ఎన్నో ప్రశ్నలు నేను విన్నా..  ఇక తిరిగి జట్టులోకి రాలేనని కూడా అన్నారు. కానీ అవేవి నేను పట్టించుకోలేదు. ఆటను నేను ఎంత ప్రేమిస్తున్నానో నాకు తెలుసు. నేను చాలా సొంతోషంగా ఉన్నా.  గాయం నుంచి తిరిగొచ్చాక సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నా.." అని బుమ్రా విమర్శకులకు బుద్దొచ్చేలా మాట్లాడారు.

Also Read :- అన్యోన్య దాంపత్యం.. గ్రాండ్‌గా సానియా- షోయాబ్ కొడుకు పుట్టిన రోజు వేడుకలు

భారత జట్టు తదుపరి మ్యాచ్‌లు

  • నవంబర్ 2: శ్రీలంకతో (ముంబై),
  • నవంబర్ 5: దక్షిణాఫ్రికాతో (కోల్ కతా),
  • నవంబర్ 12: నెదర్లాండ్స్‌తో (బెంగళూరు)